హైదరాబాద్ : తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్లను అందుబాటులో పెట్టామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,09,831మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,556 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ పలు సూచనలు జారీ చేశారు.
పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ సూచనలు...
పరీక్షా ప్రారంభానికి ఒక గంట ముందు నుంచే అంటే ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తారు.
విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో పరీక్షా కేంద్రాలకు రాకూడదు.
విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్‌ను తీసుకు రావాలి.
సెల్‌ఫోన్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవు.
ఉదయం 9 : 30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదు.
విద్యార్థులు హాల్ టికెట్లను WWW.bsetelangana.org నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
హాల్ టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఒక ఫొటోనే అతికించి ఎవరైనా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa