ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్రమత్తమైన అమెరికా దర్యాప్తు సంస్థలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 10:25 AM

సీఐఏ రహస్యాలను వికిలీక్స్‌ బట్టబయలు చేయడంతో అమెరికా దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. సీఐఏలో లీకులపై అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. దీనిపై సీఐఏ, ఎఫ్‌బీఐ సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. వికీలీక్స్‌ బయటపెట్టిన ఫైల్స్‌ అసలైనవేనా? ఈ ఫైల్స్‌ వికీలీక్స్‌ చేతికి ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తు మొదలైంది. అయితే ఈ లీకుల వ్యవహారం అంతర్గతంగా జరిగిందా?  లేక బయట నుంచి సైబర్‌ దాడి జరిగిందో కూడా తేల్చనుంది. అమెరికా ఇంటిలిజెన్స్‌ సామర్థ్యాలను దెబ్బతీసేందుకు వికీలీక్స్‌ ఈ పని చేసిందని సీఐఏ ఆరోపించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa