ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా అభిప్రాయాలను వ్యక్తం చేశా, ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 10:40 AM

మహిళలను రాంగోపాల్ వర్మ అవమానించారని ఆరోపిస్తూ హిందూ జన్‌జాగరణ్‌ సమితి అనుబంధ సంస్థ అయిన రణ్‌రాగిని మపుసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై సైబర్‌ క్రైం చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో వర్మ ట్విటర్‌లో మహిళాలోకానికి క్షమాపణలు కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఉద్దేశపూర్వకంగా కాదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలి అని వర్మ ట్విటర్‌లో రాశారు. అయితే తన ట్వీట్‌తో పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి మాత్రం తాను క్షమాపణలు కోరడం లేదని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొనడం గమనార్హం. తప్పోఒప్పో నా మనసుకు తోచింది నేను రాశాను అంటూ మరో ట్వీట్‌ చేశాడు. నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు దిగివచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa