ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్‌ కార్డు చార్జీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన పేటీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 10:41 AM

న్యూఢిల్లీ: మొబైల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం క్రెడిట్‌ కార్డుతో టాప్‌ అప్‌లపై విధించిన 2శాతం చార్జీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. లక్షలాది ఖాతాదారులు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  2 శాతం ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.వినియోగదారుల సౌలభ‍్యమే తమకు అత్యంత ముఖ్యమని,అందుకే క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై ఇటీవల విధించిన ఫీజును రద్దు చేస్తున్నామని  పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు. అలాగే తమ సేవల దుర్వినియోగాన్ని పసిగట్టేందుకు తమ బృందాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్టు  పేర్కొన్నారు. మరోవైపు మరో వాలెట్‌ సంస్థ మొబిక్విక్‌ తమ వాలెట్స్‌లో క్రెడిట్‌ కార్డులతో టాప్‌ అప్‌ చేస్తే ఎటువంటి చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa