తమిళ గాయని సుచిత్ర కార్తీక్ పలువురు హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కలకలం రేపుతున్న విషయంపై ఆర్య స్పందిసతూ గాయని సుచిత్ర లీక్ చేసే ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని ఆరోపించాడు. వాటిని ప్రజలు నమ్మకూడదని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇలాంటి చవకబారు ప్రచారం చేసి బెదిరిస్తోందని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఇకపై ఆమె మరిన్ని ఫేక్ వీడియోలను కూడా విడుదల చేయొచ్చన్నారు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో ఇలాంటి నకిలీ వీడియోలు రావడం ఎంతో సాధారణమేనని చెప్పాడు. వాటికి సినీనటుల పేర్లు జోడిస్తే వైరల్‌గా మారుతాయన్నారు. ప్రజలు వాటిని చూస్తూ ప్రోత్సహించకూడదన్నారు. సుచిత్ర సోషల్ మీడియాలో పెడుతున్నవన్నీ నకిలీవని తాను ఖచ్చితంగా చెప్పగలనని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa