న్యూఢిల్లీ: గత ఏడాది నవంబరులో దేశంలో పెద్దనోట్లను రద్దుచేసిన అనంతరం డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఈ నేపధ్యంలోనే బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో బ్యాంకులు కూడా వినియోగదారుల నుండి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సేకరించిన అనంతరమే ఖాతాను తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు కూడా తమకు సంబంధించిన అన్ని వివరాలను ఆధార్ లాంటి దృవ పత్రాలతో సహా బ్యాంకులకు సమర్పిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం కూడా అన్ని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు వినియోగదారుల కేవైసి పత్రాలను తప్పనిసరి చేసింది. ఫలితంగా నోట్ల రద్దు అనంతరం పెరిగిన డిజిటల్ లావాదేవీలతో పాటు ఈ కేవైసి నమోదు కూడా మరింత ముమ్మరమైంది. ప్రభుత్వం 2016లో సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటిసేషన్ అసెట్ రికనస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్‌ట ఆఫ్ ఇండియా(సిఇఆర్‌ఎస్‌ఎ)కు అనుబంధంగా సెంట్రల్ కేవైసి రికార్‌డ్స రిజిస్ట్రీ(సికెవైఆర్‌సి)ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం ఖాతాదారుల కేవైసి వివరాలను భద్రపరిచేందుకు కృషి చేస్తుంది. ఈ విధానం వేగవతం కావడంతో దేశంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక వేదిక మీదకు తీసువచ్చేందుకు సాధ్యమవుతుంది. నల్లధన నియంత్రణకు కృషిచేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)కూడా సికెవైసిఆర్ సాయాన్ని తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa