షాంఘై : చైనాలోని షాంఘైలో ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. పీపుల్స్ స్కేర్ వద్ద స్టార్బక్స్ సమీపంలో ఓ వ్యాన్ బీభత్సం సృష్టించిన ఇమేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాహనంలో గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు కొందరు సాక్షులు తెలిపారు.