హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యపై వేటు పడింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు రేవంత్, సండ్రను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa