ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమాపణలు చెప్తే సస్పెన్షన్‌ ఎత్తివేతపై ఆలోచిస్తాం : హరీష్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 11:27 AM

హైదరాబాద్‌ :తెలంగాణ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల్లో టిడిపి సభ్యుల పై సస్పెన్షన్‌ వేటు ఉపసంహరించుకోవాలని కోరిన కిషన్‌రెడ్డి, జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. రెండవరోజు అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసం గించేటప్పుడు ఎవరైనా పోడియం దగ్గరకు వెళ్లినా, అడ్డుచెప్పినా చర్యలు తీసుకోవాలని బీఏసీ సమావేశంలో చర్చించుకున్నామని, కొత్త రాష్ట్రం, కొత్త శాసనసభలో అందరం కలిసే నిర్ణయం తీసుకున్నామన్నారు. చట్టసభలు జరిగేటప్పుడు డెకోరా పాటించకపోతే చర్యలు తీసుకుంటామని స్వయంగా స్పీకరే అందరికీ చెప్పారని ప్రజా సమస్యలను చర్చించకూడదనే ఉద్దేశ్యంతో మాత్రం సభ్యులను సస్పెండ్‌ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం ఏ అంశాన్నైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రభుత్వ సమాధానం సరిగ్గా లేకపోతే వాక్‌ అవుట్‌ చేయాలి గాని, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నిన్న అకారణంగా సభ నుంచి వాక్‌ అవుట్‌ చేయడం గవర్నర్‌ను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన సభ్యులు బేషరతుగా సభకు క్షమాపణ చెప్తే సస్పెన్షన్‌పై పునరాలోచిస్తామని మంత్రి పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa