ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలుంటే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తా : కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 03:11 PM

హైదరాబాద్ : ఉద్యోగాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వెలిబుచ్చారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించింది.. ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలను ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే లక్ష వరకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పామని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఉద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలుంటే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa