ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రకోట వద్ద ఐపీఎల్‌ ట్రోఫీ సందడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 03:52 PM

  ఢిల్లీ : దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద ఐపీఎల్‌-10 విజేతలు అందుకోబోయే ట్రోపీ సందడి చేసింది. శుక్రవారం చంఢీగర్‌ నుంచి దిల్లీ చేరుకున్న ట్రోఫీని శనివారం ఉదయం ఎర్రకోట వద్ద ప్రదర్శనకు ఉంచారు.

ఈ నేపథ్యంలో సినీతార సుర్వీన్‌ చావ్లా ట్రోఫీ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అనంతరం నిర్వాహకులు ట్రోఫీని దిల్లీలోని సిటీ వాక్‌ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. అభిమానుల కోసం నిర్వాహకులు దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఐపీఎల్‌ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ట్రోఫీ దిల్లీ చేరుకుంది. దిల్లీ తర్వాత ఈ నెల 13న ట్రోఫీ బెంగళూరుకు చేరనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa