విదేశాలలో ఉన్న భారతీయులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే రియాక్ట్ అయ్యే వారిలో ముందుంటారు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఇప్పటి వరకు ఎంతో మందికి మానవ దృక్పథంతో సాయం చేసిన సుష్మా స్వరాజ్‌ని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ అభ్యర్ధించింది. భారత్‌కు రావాలనుకుంటున్న తన స్నేహితురాలి వీసా పలు మార్లు తిరస్కరించబడడంతో, ఆమెకి వీసా ఇప్పించాలని సుష్మాకి ట్వీట్ చేసింది మల్లికా. చిన్నారులు, మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు డచ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రీ-ఏ-గర్ల్’ సహ వ్యవస్థాపకురాలు ఎవ్లీన్ హాల్స్కెన్ భారత్‌కు వచ్చేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని పలు కారణాల వలన వీసా తిరస్కరించబడుతుంది. తన స్నేహితురాలి వీసా విషయంలో కాస్త చొరవ చూపాలంటూ నటి విజ్ఞప్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, మహిళల రక్షణకు ఫ్రీ-ఏ-గర్ల్ ఎంతగానో పాటుపడుతోంది. సుష్మాస్వరాజ్ గారు ఎవ్లీన్ వీసాకు సాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని మల్లిక ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఈ ఎన్జీవో చేపట్టిన ‘స్కూల్ ఫర్ జస్టిస్2 కార్యక్రమానికి మల్లిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.