రోడ్డుప్రమాదంలో చిరుత మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:11 PM
 

నిజామాబాద్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ - బాసర రహదారిపై రోడ్డుప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. చిరుత రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన వాహనదారులు పోలీసు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. చిరుతను పరిశీలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. చిరుత శరీరంపై బలమైన గాయాలున్నాయి. భారీ వాహనం ఢీకొట్టడం వల్లే చిరుత మృతి చెంది ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌కు తరలించారు. నెల రోజుల్లో ఇది రెండో సంఘటన అని అధికారులు తెలిపారు.