పబ్ ఓనర్లకు భజరంగ్‌దళ్ మెమోలు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:15 PM
 

హైదరాబాద్: రేపు వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించొద్దని భజరంగ్‌దళ్ కార్యకర్తలు పబ్బుల యజమానులకు సూచించారు. వాలంటైన్స్ డే నేపథ్యంలో భజరంగ్‌దళ్ సభ్యులు ఇవాళ హైదరాబాద్ నగరంలోని పబ్బులకు వెళ్లారు. వాలంటైన్ డే పేరుతో పబ్బుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను కించ పరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టవద్దని కోరుతూ పబ్బుల యజమానులకు మెమోలు జారీ చేశారు.