ఉగ్రదాడులను నిరోధించడంలో మనం విఫలమయ్యాం : ఒవైసీ

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:31 PM
 

న్యూఢిల్లి : ఉగ్రదాడులు జరగకుండా నిరోధించడంలో మనం విఫలమయ్యామని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకోలేదని ఆయన అన్నారు. 2003లో కూడా సుజవాన్‌లో ఇటువంటి దాడి జరిగిందని ఆయన అన్నారు. ఆ తరువాత వరుసగా నగోటా, పఠాన్‌కోట్‌ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగాయని ఒవైసీ అన్నారు. ఉగ్రదాడులను నివారించడంలో మనం విఫలమయ్యామని, దీనిని అంగీకరించక తప్పదని ఆయన అన్నారు.