టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం నేతలు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:41 PM
 

హైదరాబాద్ : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ పాతబస్తీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మూసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్, మహ్మద్ అఖిల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్‌ లో చేరారు. డిప్యూటి సీఎం మహమూద్ అలీ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్సీనించారు. సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని మహమూద్ అలీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వంద సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.