పంజాగుట్టలో పోలీస్‌ వ్యాను బోల్తా

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:53 AM
 

నగరంలో పోలీసు వ్యానుకు ప్రమాదం జరిగింది. పంజాగుట్టలో రహదారిపై వెళుతున్న పోలీసు వ్యాను ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యూసఫ్‌గూడ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.