నేటి నుంచి మైనింగ్‌ టుడే 2018 సదస్సు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:02 AM
 

 హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కి కలిపి నిర్వహిస్తున్న 'మైనింగ్‌ టుడే 2018' అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా ఈ సదస్సు నాలుగురోజుల పాటు జరుగుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణఫ్రికాలతోపాటు మనదేశం నుంచి మైనింగ్‌ ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యఅతిథిగా తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ హాజరై సదస్సును ప్రారంభించనున్నారు.