గుర్తు తెలియని మృతదేహం లభ్యం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:29 AM
 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందు బై పాస్ రోడ్డులో ఉన్న జామాయిల్ తోటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. తోట యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఐదు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శవం పూర్తిగా కుళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.