సమాజంలో చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని బిజెపి : మాణిక్‌ సర్కార్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:51 AM
 

బాష్పకూర్‌ : త్రిపుర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బిజెపి-ఐపిఎఫ్‌టి కూటమి యత్నిస్తోందని, దీనికోసం సమాజంలో చిచ్చు పెడుతోందని ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అన్నారు. గత పాతికేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న సిపిఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్‌ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా బిజెపి పార్టీ త్రిపురలోని ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి)తో పొత్తు కుదుర్చుకుంది. ఉగ్రవాదులతో ఐపిఎఫ్‌టికి సంబంధాలున్నాయని మాణిక్‌ సర్కార్‌ ఆరోపించారు.