వాలెంటైన్స్‌ డే సందర్భంగా పార్కులు మూసివేత

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 11:32 AM
 

హైదరాబాద్‌ : వాలెంటైన్స్‌ డే సందర్భంగా నగరంలో ఉన్న పార్కులన్నీ దాదాపుగా మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రైవేట్‌ ప్రాంతాల్లో ఈ రోజు ఏ ఒక్క జంట కనిపించినా..వారికి పెళ్లి చేస్తామని భజరంగ్‌ దళ్‌ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పార్కులు మూతపడినట్లు సమాచారం. కేబీఆర్‌ పార్క్‌, కృష్ణకాంత్‌, జలగం వెంగళరావ్‌ పార్క్‌, సంజీవయ్య పార్క్‌, రాక్‌ పార్క్‌, ఇందిరా పార్క్‌, యోగి బీర్‌ మినీ గోల్ఫ్‌ పార్క్‌, కెఎల్‌ఎన్‌ పార్క్‌, చాచా నెహ్రూ, బటర్‌ ఫ్లై గార్డెన్‌, ఆస్ట్రో పార్క్‌లతో సహా ఇతర చిన్న చిన్న పార్కులు సైతం మూతపడ్డాయి. ఆఖరికి టూరిజం ప్రాంతాలుగా చెప్పుకునే లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లను సైతం భజరంగ్‌ దళ్‌ హెచ్చరికలకు మద్దతు పలుకుతూ మూసివేశారు నిర్వాహకులు..