17 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:33 PM
 

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు. 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారు. 25న దివ్యవిమాన రథోత్సవం, 26న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 27న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో గీత వివరించారు.