మోడీ కేర్‌ పథకం అవసరం లేదు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:36 PM
 

కోల్‌కతా :కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం మోడీ కేర్‌ తమకు అవసరం లేదని పశ్చిమ బెంగాల్‌ స్పష్టం చేసింది. తద్వారా ఈ పథకాన్ని తిరస్కరించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్‌ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ఇప్పటికే స్వస్థ్య సాథీ పథకాన్ని అమలు చేస్తున్నామని, 50 లక్షలమందికపైగా ప్రజలు ఇందులో నమోదయ్యారని పశ్చిమ బెంగాల్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం కోసం రాష్ట్రం 40 శాతం నిధులు సమకూర్చాల్సి ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో ఇటువంటి పథకం ఒకటి కొనసాగుతుండగా మళ్లి ఈ పథకం అవసరమేమిటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం వద్ద వనరులు ఉంటే తమ స్వంత పథకాన్ని అమలు చేసుకోవచ్చునని ఆమె అన్నారు.