తాజ్‌మహల్‌ సందర్శన ఛార్జీలను పెంచిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:51 PM
 

లక్నో :  తాజ్‌ సందర్శన ఛార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. తాజ్‌ మహల్‌లోకి ప్రవేశ రుసుమును 40 రూపాయిల నుంచి 50 రూపాయిలకు పెంచారు. కాగా తాజ్‌ మహల్‌లోని ప్రధాన సమాధి వద్దకు వెళ్లడానికి 200 రూపాయిల రుసుమును ప్రవేశపెట్టారు.