పాకిస్థాన్ వాళ్లతో యుద్ధం ఏంటి?: ధర్మేంద్ర ప్రధాన్

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 01:02 PM
 

న్యూఢిల్లీః పాకిస్థాన్ ఓ బచ్చా దేశమని, వాళ్లతో యుద్ధమేంటని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రీసెంట్‌గా పాకిస్థాన్ జరిపిన సర్జికల్ స్ట్రెక్స్‌పై స్పందిస్తూ.. ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం భారత్‌కు ఉన్న బలానికి చైనానే లైట్ తీసుకుంటున్నారని, ఇక పాకిస్థాన్ ఎంత అని ప్రధాన్ అన్నారు. డోక్లామ్ సమస్య సమయంలో జరిగిన ఓ ఘటన గురించి ఆయన వివరించారు. ఆ సమయంలో తాను ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని, అందులో పాల్గొన్న ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. మరి డోక్లామ్ విషయంలో ఏమవుతుంది అని ఆయనను నేను ప్రశ్నించాను. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం భారత మిలిటరీ చాలా బలంగా ఉంది. అది పాకిస్థాన్ అయినా, చైనా అయినా వాళ్లకంటే చాలా బలంగా ఉన్నాం. ఇదో పెద్ద విషయం కాదు అని అన్నారు. అందుకే చెబుతున్నా.. పాక్‌తో చిన్నపాటి యుద్ధంగా కూడా దీనిని పరిగణించడం లేదు. అయితే కవ్విస్తున్న ప్రత్యర్థికి అలాగే సమాధానం మాత్రం చెబుతాం అని ప్రధాన్ అన్నారు.