తొర్రూరు మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 01:03 PM
 

మహబూబాబాద్ : తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. 40 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు పనులకు, బుడిగ జంగాల కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, స్మశానవాటిక, 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, బంగారు నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. 


Telangana E-Paper