గాంధీ ఆస్పత్రిలో నర్సుల ఆందోళన

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 02:33 PM
 

హైదరాబాద్‌:  గాంధీ ఆస్పత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. జూనియర్‌ డాక్టర్‌ కిరణ్‌ నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వారు ఆరోపిస్తూ ఆర్‌ఎంవో ఆఫీసు ముందు బైఠాయించారు. అసభ్యంగా ప్రవర్తించిన జూనియర్‌ డాక్టర్‌ కిరణ్‌ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.