నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: శ్రవణ్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 02:46 PM
 

  తాను కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలోకి మారుతున్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైద్రాబాద్ సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతికి బుధవారం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీనే పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేయిస్తోందని శ్రవణ్‌ ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.