ఎఐఎడిఎంకె నుంచి 40 మందిని బహిష్కరించిన అధిష్టానం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:08 PM
 

ఎఐఎడిఎంకె అధినేతలు ఒ పన్నీర్‌ సెల్వం, కె పళనిస్వామి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నేడు 46 మంది కార్యవర్గ సభ్యులను పార్టీనుంచి బహిష్కరించారు. వీరిపై ప్రస్తుతం పార్టీలో వారు నిర్వహిస్తున్న పదవులతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వంపై కూడా బహిష్కరణ వేటు పడింది.