నేడు ఉప్ప‌ల్ నరబలి కేసులో డీఎన్ఏ రిపోర్టు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:09 PM
 

హైదరాబాద్ లోని చిలుకానగర్ నరబలి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చిన్నారి తల నమూనాలను డీఎన్ఏ పరీక్షకు మూడు రోజుల ముందే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. శాస్త్రీయంగా లింగ నిర్ధారణపై పోలీసులు దృష్టి సారించారు. నేడు డీఎన్ ఏ నివేదిక పోలీసులకు అందనుంది. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్ల‌నున్నారు.