కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:48 PM
 

హైదరాబాద్ : తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ( టి పొలిటికల్ జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆయనను ఆహ్వానించారు. ఈ భేటీలో ఇరువురి మధ్యా రాజకీయ చర్చ కూడా జరిగినట్లు సమాచారం. కోదండరామ్ తో  తన భేటీ మర్యాదపూర్వకంగా జరిగినదేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని రేవంత్ ట్వీట్ చేశారు.