కుంభకోణం దేవాలయంలో అగ్ని ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 04:09 PM
 

కుంభకోణంలోని ఆది  కుంబేశ్రవర దేవాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తిన సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆలయంలో గ్యాస్ సిలెండర్ పేలి అగ్రి ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆలయ అధికారులు తెలిపారు. నిముషాల వ్యవధిలోనే మంటలు అదుపులోనికి వచ్చాయి.