ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కేసీఆర్ బర్త్‌డే.. వేడుకలకు భారీ ఏర్పాట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 10:28 AM

నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌ డే డాడ్ అంటూ ట్వీట్ చేశారు. అలాగే కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఎంపీ కవిత ఆవిష్కరించారు. మరోవైపు సీఎం బర్త్ డే వేడుకల కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.


తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ యువజన విభాగం, టీఆర్‌ఎస్వీలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు చేతికర్రల పంపిణీ చేయనున్నారు. అలాగే ఉప్పల్ స్టేడియంలో జీహెచ్‌ఎంసీ 25 వేల మందితో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేసింది. ఇటు విదేశాల్లోనూ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు ఎన్‌ఆర్ఐలు భారీ ఏర్పాట్లు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com