హైదరాబాద్: విరాట కోహ్లీ తన ఫామ్‌తో క్రికెట్ ప్రేమికుల్ని స్టన్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సెంచరీలతో చెలరేగుతున్న తీరు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నది. క్రికెట్ లెజెండ్ సచిన్‌ను కూడా దాటేస్తాడని ఇప్పటికే బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. మరి కోహ్లీ వన్డేల్లో ఎన్ని సెంచరీలు సాధిస్తాడు. ఈ ప్రశ్నకు ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సమాధానం ఇచ్చాడు. కోహ్లీ తన కెరీర్ మొత్తంలో 62 వన్డే సెంచరీలు నమోదు చేస్తాడని వీరూ తెలిపాడు. ట్విట్టర్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తనదైన స్టయిల్లో విశ్లేషణ చేశాడు. భవిష్యత్తు అంచనాల ప్రకారం కోహ్లీ వన్డేల్లో మొత్తం 62 సెంచరీలు చేస్తాడని వీరూ తేల్చేశాడు. ఫామ్, ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనా వేస్తున్నట్లు వీరూ తెలిపాడు. 463 వన్డేలు ఆడిన సచిన్.. 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 208 వన్డేలు ఆడాడు. అందులో 35 వన్డేలు చేశాడు. బ్యాటింగ్ సగటు కూడా సచిన్ కన్నా కోహ్లీదే బెస్ట్‌గా ఉంది. ఒక వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే అని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ కూడా ఆసక్తికర కామెంట్ చేయడం విశేషం.