హైదరాబాద్: కూకట్పల్లిలోని చట్నీస్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటలార్పారు. స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం వెల్లడించింది. పక్కనే జోయలుక్కాస్ జుయెలరీ షాప్ కూడా ఉండటంతో వెంటనే అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమయి మంటలను త్వరితగతిన ఆపేశారు.