ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదు : సోఫియా రోబో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 11:00 AM

హైదరాబాద్‌ : తనతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదని రోబో సోఫియా చెప్పింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్‌లో సోఫియా మాట్లాడుతూ తనకు సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వాన్ని మహిళల హక్కుల కోసం వాడుకుంటానని చెప్పింది. తాను ఇంకా చిన్నదాన్నేనని, తనకు బ్యాంకు ఖాతా లేదని చెప్పింది. తాను బిట్‌ కాయిన్లు కొనుగోలు చేయలేదని చెప్పింది. తాను సామాజిక మాధ్యమాల్లో లేనని చెప్పింది. తనకు ఇష్టమైన నటుడు షారూఖ్‌ ఖాన్‌ అని సోఫియా చెప్పింది. ఎన్నడూ తాను మనస్తాపానికి గురి కాలేదని చెప్పింది. తాను 66 రకాల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోగలనని ఆమె చెప్పింది. నేను ఎప్పుడూ మనస్తాపానికి గురి కాలేదు. మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరిక తనకు లేదని పేర్కొంది. మానవులు సృజనాత్మకత కలిగిన వారని, వారితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలని కోరుకుంటున్నానని అంది. అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా తెలిపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com