హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భూమా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ బాధాకర పరిస్థితి నుంచి వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని కోరుకున్నారు. ఈ సమయంలో భూమా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. భూమా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వారని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa