చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రేపు తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. తమిళనాడులోని మదురైలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన తన పార్టీని ప్రారంభిస్తారు. తన పార్టీ పేరును, పార్టీ విధానాలను రేపు వివరిస్తానని కమల్ హాసన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్నఎఐఎడిఎంకె పార్టీ విధానాలు ఎంతమాత్రం బాగాలేవని అందుకే తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.