కుమ్రం భీం ఆసిఫాబాద్ : తిర్యాణి మండలం గుండాల గ్రామంలో రామగుండం సీపీ విక్రంజిత్ దుగ్గల్ మంగళవారం పర్యటించారు. దుగ్గల్తో పాటు ఆయన చిన్ననాటి మిత్రుడు, బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా ఉన్నారు. దుగ్గల్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గుండాల గ్రామంలో పర్యటించిన సీపీ దుగ్గల్.. గ్రామస్తులకు దుప్పట్లు, దోమతెరలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి దుగ్గల్, అభినవ్ శుక్లా భోజనం చేశారు.