ఈ మధ్య స్కూల్, కాలేజీ లలో ప్రేమ పాటలు పెరిగిపోతున్నాయి.. చదువు చెప్పమని పంపిస్తే ఏకంగా విద్యార్థులకు ప్రేమ పాటలు చెప్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.. విద్యార్థినికి ‘ఐ లవ్ యూ’ చెప్పిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు..అసలు విషయానికి వస్తే తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో, మేల్మలైనూర్లోని సెయింట్ ఆంటోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న 48 సంవత్సరాలు కలిగిన నిర్మల్ అనే వ్యక్తి మొన్న ఫిబ్రవరి 14 న 13ఏళ్ల విద్యార్థినికి గులాబీ పువ్వు ఇస్తూ.. ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. ఆమె విలపిస్తూ ఇంటికెళ్లి ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారి ఫిర్యాదుతో పోలీసులు నిర్మల్‌ను,అతనికి సహకరించిన మరో ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు..