కాంగ్రెస్‌లోకి నాగం జనార్దన్‌ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 21, 2018, 10:28 AM
 

న్యూఢిల్లి :బిజెపి నేత నాగం జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం నాగం జనార్దన్‌ రెడ్డి తెలంగాణ పిసిపి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్న నాగం జనార్దన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా పని చేశారు. నాగం 2013లో బిజెపిలో చేరారు.