ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 08:34 AM

పెద్ద నోట్ల రద్దు దెబ్బకు భారత్‌లో బంగారం డిమాండ్ అమాంతంగా పడిపోయింది. దాంతో దేశంలోకి పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. గత ఏడాది డిసెంబర్‌లో 54.1 టన్నుల బంగారం దిగుమతి కాగా.. జనవరిలో 53.2 టన్నులుగా నమోదైంది. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 2016లో మాత్రం 119.2 టన్నుల గోల్డ్ భారత్‌కు తరలివచ్చింది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులపాటు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, చాలా మంది తమ నల్లధనాన్ని గోల్డ్ రూపంలోకి మార్చుకునేందుకు ప్రయత్నించడం ఇందుకు కారణమని తెలిపింది. రద్దు చేసిన నోట్లతో భారీ ప్రీమియం చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కావడంతో నవంబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయని, ఆ తర్వాత రెండు నెలల్లో మాత్రం భారీగా తగ్గాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నెలల కాలానికి (ఏప్రిల్ 2016- జనవరి 2017) బంగారం దిగుమతులు 546 టన్నులుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 892.9 టన్నులు దిగుమతైంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa