ఈ నెల 26 కరీంనగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను కెలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టిబందో బస్తు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.