ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సదస్సుకు రైతు సమన్వయ సమితి సభ్యులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 09:45 AM

కరీనంనగర్ : ఇవాళ కరీంనగర్ లో జరుగనున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు సభ్యులు హాజరయ్యేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న సదస్సు కోసం బోధన్, కోటగిరి, జగిత్యాల నుంచి రైతు సమన్వయ సమితి సభ్యులు బయలుదేరారు. బోధన్ మండల సమన్వయ సమితి కో ఆర్డినటర్ బుద్దె రాజేశ్వర్, సభ్యులు, ఉన్నతాధికారులు ఇవాళ ఉదయం జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభించారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నుండి రైతు సమన్వయ సమితి సభ్యులు సీఎం సభకు బస్సుల్లో బయలుదేరారు. ప్రత్యేక మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, జిల్లా సమన్వయ సమితి సభ్యులు సదస్సులో పాల్గొననున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa