ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 11:29 AM

వరంగల్ రూరల్ : నర్సంపేట మండలం సీతారాం తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. నర్సంపేట ద్వారకాపేట నుంచి దాసరిపల్లెలో వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa