ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 12:25 PM

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కృతజ్ణతలతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారనని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నిరంగాలలోనూ తెలంగాణ నిర్లక్షానికి గురైందని, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాలలోనూ పురోగతి సాధిస్తున్నదన్నారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ఆదాయం తగ్గిన్పటికీ 19.61శాతం వృద్ధి సాధించామని ఈటల చెప్పారు. వరుసగా నాలుగో సారి బడ్జెన్ ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఈటల అన్నారు.  ఎస్పీఎస్టీ ఉపప్రణాళికకు నిథుల కేటాయింపు కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఆ కమిటీ నిర్ణీత కాలవ్యవధి మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాలన్నారు.


-రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు


-ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు


-నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు


-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు


-వచ్చే రెండేళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తాం


-75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ


-మూసీ ప్రక్షాళనకు రూ. 350 కోట్లు


-కేసీఆర్ కిట్ కోసం రూ. 605 కోట్లు కేటాయింపు


-శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్


-ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తాం


-డిశ్చార్జి అయిన వెంబడే రూ. 4వేలు


-శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేలు


-మొత్తంగా మూడు విడతల్లో రూ. 12 వేలు ఇస్తాం


-ఆడబిడ్డ పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తాం


-వ్యవసాయ రంగానికి రూ. 5,942 కోట్లు


-నీటిపారుదల రంగానికి రూ. 23,675 కోట్లు


-రజక, నాయిబ్రహ్ముణులకు రూ. 500 కోట్లు


-ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు


-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అర్హులకు రూ. 51 వేల నుంచి రూ. 75,116కు పెంపు


-మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు


-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు


-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు


-ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు


-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు 


-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు


-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు


-చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు 


-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు


-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు


-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు


 


-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు


-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు


-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు


-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు


-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు


-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు


 


-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు


-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు


-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు


-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు


-హరితహారానికి రూ. 50 కోట్లు


-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు


-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు


-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు


-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు


-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు


-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి


-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం


-19.61 శాతం వృద్ధిరేటు సాధించాం


-రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది


-కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం


-2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం


-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం


-కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది


-ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు


-ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం


-ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది


-నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు


- వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa