హైదరాబాద్: ఉస్మానియ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్, కన్వీనర్ ప్రొ. బి.రెడ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సదస్సు బ్రోచర్‌ను విభాగంలోని అధ్యాపకులు ఆవిష్కరించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదరుగా ఉన్న జంతుశాస్త్ర విభాగం భవనంలో రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సును సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రాతో పాటు దేశంలోని పలు పరిశోధన రంగాల శాస్త్రవేత్తలు, వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు పాల్గొంటారని వారు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa