నటి శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ విమానాశ్రాయానికి చేరుకుంది. పార్థీవ దేహం పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. రాత్రి 10గం.లకు ముంబై చేరుకోనున్నట్టు తెలుస్తుంది. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ ప్రాసీక్యూషన్ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. మరోవైపు బోనీకపూర్ కి క్లీన్ చీట్ ఇచ్చిన దుబామ్ పోలీసులు శ్రీదేవి పార్ధీవ దేహంతో పాటు భారత్ కి వెళ్ళేందుకు అనుమతించారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం 11 గంటల వరకు శ్రీదేవి స్వగృహం భాగ్య బంగ్లాలో శ్రీదేవి భౌతిక కాయం ఉంచుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు సమాచారం.
#Sridevi's body has been embalmed and is being taken to the airport, expecting to reach Mumbai by 9 PM. pic.twitter.com/rY6wdwNnyg
— Hari Prabhakaran (@Hariadmk) February 27, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa