హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లో మంత్రుల పర్యటన సాగనున్నది. నల్లగొండ, భువనగిరి ఎంపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.25 గంటలకు మద్దిరాల క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa