ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అఖిలేశ్ ఓటమి అంశాన్ని పక్కకుపెట్టి ఈ రోజు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తన సొంత జిల్లా ఇటావాలో జరిగిన హోలీ సంబరాల్లో ఆయన పాల్గొని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.వారితో కలిసి హోలీ ఆడుతూ సందడిగా గడిపారు. ఈ హోలీ సంబరాల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం విశేషం. తాజా ఎన్నికల ఫలితాల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 54సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 403స్థానాల్లో భాజపా 325స్థానాల్లో గెలిచి యూపీలో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa